విజేతల్ని ఆకాశానికి ఎత్తే విధానం మారాలి..

- November 29, 2017 , by Maagulf
విజేతల్ని ఆకాశానికి ఎత్తే విధానం మారాలి..

ఆటలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. సరదాగా మొదలు పెట్టిన ఆట అదే కెరీర్‌గా మారుతుందని ఎవరూ ఊహించరు. అవకాశాలు కూడా అందర్నీ వరించవు. గెలుపు ఓటముల రుచి చూస్తూ, ఎత్తు పల్లాల్ని అధిగమిస్తూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొటూ చివరకు ఎవరో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు. అది ఒక్క ఆటల్లోనే కాదు.. అన్నింటా ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ విజేతల్ని మాత్రమే ఆకాశానికి ఎత్తే ధోరణి సరికాదంటున్నాడు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా క్రీడా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన చర్చా గోష్టిలో గోపీచంద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రీడలకు ప్రాధాన్యమిస్తూ స్థానిక క్రీడల్ని మరచి పోతున్నాం. మీడియా కూడా స్థానిక క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి. పారిశ్రామిక వేత్తలు కూడా ఆ దిశగా ఆలోచించాలి అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడల్ని ఒక పరిశ్రమగా భావించి పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించాలి అని అన్నారు. దేశంలో క్రీడా సంస్క‌ృతి పెంపొందించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. ఆటలు ఆడే వాళ్లందర్నీ ఛాంపియన్లుగా భావించి ఆ దిశగా ప్రోత్సహిస్తే మెరుగైన క్రీడాకారులు వెలుగు చూసే అవకాశం ఉంటుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com