కోర్టులోనే విషం తాగి చనిపోయిన ఖైదీ
- November 29, 2017
యుద్ధం పేరుతో లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నారంటూ ఓ ఖైదీకి శిక్ష విధించింది న్యాయస్థానం. అది విన్న అతడు తాను ఏ నేరం చేయలేదని అరుస్తూ కోర్టు ప్రాంగణంలోనే విషం తాగి చనిపోయాడు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బోస్నియా-హెర్జ్‌గోవినాలో 1990లో యుద్ధం జరిగింది. ఇందులో లక్ష మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ యుద్ధానికి కారణం బోస్నియా క్రోట్ నాయకులేనంటూ అక్కడి ప్రభుత్వం వారిని నేరస్థులుగా నిర్ధారించింది. ఇందులో బోస్నియా క్రోట్ నేత, 72ఏళ్ల స్లోబోడన్ ప్రల్జక్ ఉన్నాడు. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం స్లోబోడన్కు 20ఏళ్ల జైలుశిక్ష విధించింది. అతడితో పాటు మరో ఐదుగురికి 10 నుంచి 25ఏళ్ల వరకు జైలుశిక్షలు ఖరారు చేసింది.
అయితే న్యాయస్థానం తీర్పు విన్న స్లోబోడన్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. తాను నేరస్థుడిని కాదని అరుస్తూ తన చేతిలోని ప్లాస్టిక్ కప్పులో ఉన్న ద్రవాన్ని తాగి కుప్పకూలిపోయాడు. స్లోబోడన్ విషం తాగినట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!