గంగిరెడ్డి ప్రాణాలకు ముప్పు
- November 14, 2015
ఎర్ర చందనం సహా పలు కేసుల్లో నిందితునిగా ఉన్న కొల్లం గంగిరెడ్డిని ఎట్టకేలకు ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న అతన్ని శనివారం సాయంత్రం ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. కొన్ని నెలలుగా మారిషస్ పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డిని తమకు అప్పగించాలని కోరుతూ సీఐడీ ఎస్పీలు మూడుసార్లు అక్కడికి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఈసారి సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా మారిషస్ వెళ్లారు. అక్కడి పోలీసులు గంగిరెడ్డిని ఆయనకు అప్పగించారు. గంగిరెడ్డిని ఆదివారం ఉదయం ఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి సాయంత్రానికి హైదరాబాద్‌కు తీసుకువస్తారని పోలీసువర్గాలు తెలిపాయి. అయితే గంగిరెడ్డికి ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 12 ఏళ్ల కిందట చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబుదాడి కేసులో గంగిరెడ్డిని అన్యాయంగా ఇరికించినా కోర్టు కొట్టివేసిందని తెలిపారు. గతంలో గంగిరెడ్డి ఒకే కేసు ఉన్నప్పటికీ, అతను ప్రాణభయంతో విదేశాలకు పారిపోయాక రాజకీయ కక్షసాధింపుతో చంద్రబాబు అనేక కేసులుపెట్టి వేధిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







