మస్కట్‌లో నీట మునిగి తండ్రి, కుమారుడి మృతి

- December 03, 2017 , by Maagulf
మస్కట్‌లో నీట మునిగి తండ్రి, కుమారుడి మృతి

మస్కట్‌: ఒమనీ తండ్రి, అతని ఆరేళ్ళ కుమారుడు మస్కట్‌లోని బర్‌ అల్‌ జిస్సాలో నీట మునిగి మృతి చెందారు. మరో తొమ్మిదేళ్ళ చిన్నారి ఈ ఘటనలో రెస్కూ చేయబడినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ చేయబడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురూ నీట మునిగిపోతున్న విషయాన్ని గమనించి అక్కడే ఉన్న వ్యక్తి వారిని రక్షించేందుకు ప్రయత్నించగా, 9 ఏళ్ళ చిన్నారిని మాత్రమే సజీవంగా ఆ వ్యక్తి కాపాడగలిగారు. వాటర్‌ బాఈస్‌, బీచ్‌లు, సరస్సుల వద్ద స్విమ్మింగ్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, భారీగా కెరటాలు వస్తున్న సమయంలో ఈత ఎట్టి పరిస్థితుల్లో క్షేమం కాదని రాయల్‌ ఒమన్‌ పోలీసులు చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com