పోలీస్ పహారాలో మురళీ మృతదేహం తరలింపు.. ఓయూలో టెన్షన్ టెన్షన్‌

- December 03, 2017 , by Maagulf
పోలీస్ పహారాలో మురళీ మృతదేహం తరలింపు.. ఓయూలో టెన్షన్ టెన్షన్‌

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మురళి.. మానేరు హాస్టల్‌ రూమ్‌లో ఉరి వేసుకున్నాడు. విషయం తెలిసినవెంటనే హాస్టల్ దగ్గరకు చేరుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది.

ఈ చదువులు తన కొద్దంటూ మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉస్మానియాలో ఎమ్మెస్సీ ఫస్టియర్ చదువుతున్న మురళి మానేరు హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం వర్సిటీలో కలకలం సృష్టించింది. ఇతడిది సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్ గ్రామం. మురళి మృతితో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మురళి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు హాస్టల్ గది నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. చదవడం తన వల్ల కావడం లేదని.. పరీక్షలు దగ్గరకు వస్తుండడంతో భయం వేస్తోందంటూ మురళి నోట్‌లో పేర్కొన్నాడు. మురళి మృతదేహాన్నిపోలీసులు తరలించకుండా విద్యార్థులు అడ్డుకోవడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. 

మురళి ఆత్మహత్య చేసుకోవడంపై వీసీ రామచంద్రం విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. విద్యార్థి ఆత్మహత్య విషయం తెలియగానే.. టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ఉస్మానియా వర్సిటీకి వెళ్లారు. సూసైడ్‌నోట్‌పై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మురళి మృతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి.. కారణాలు తెలుసుకోవాలని కోరారు. మురళి సూసైడ్‌ నోట్‌లో ఉన్న చేతిరాత అతడిదికాదని తోటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థి ఆత్మహత్యతో యూనివర్సిటీలో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు ఆందోళనకు దిగకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com