నన్నపనేని: శైలజకు అండగా ఉంటాం

- December 04, 2017 , by Maagulf
నన్నపనేని: శైలజకు అండగా ఉంటాం

తిరుపతి: తొలిరాత్రి భర్త చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శైలజను ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషనర్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. అనంతరం రాజకుమారి మాట్లాడుతూ.. శైలజపై కిరాతకంగా దాడికి పాల్పడిన ఆమె భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి శైలజ భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com