తెలుగు మహాసభల కోసం కేబినెట్ సబ్ కమిటీ
- December 04, 2017
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీని సీఎం నియమించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, చందులాల్ కొనసాగనున్నారు. సాహిత్య అకాడమీ, ఇతర సంస్థల సమన్వయంతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే తెలుగు మహాసభలకు సంబంధించి పలు చోట్ల సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ప్రగతి భవన్‌లో సమీక్ష ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్.. ఎల్బీ స్టేడియానికి చేరుకుని తెలుగు మహాసభల ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోపం లేకుండా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. మహాసభలకు వచ్చే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తెలుగు మహాసభల ఏర్పాట్లను చకచక పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ వెంబడి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు