యూఏఈ వెదర్‌: 4.8కి పడిపోయిన ఉష్ణోగ్రతలు

- December 04, 2017 , by Maagulf
యూఏఈ వెదర్‌: 4.8కి పడిపోయిన ఉష్ణోగ్రతలు

యూఏఈలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రత ఈ సీజన్‌లో నమోదయ్యింది. 4.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత జైస్‌ మౌంటెయిన్‌ పరిధిలో నమోదయ్యింది. మెబ్రెహ్‌ మౌంటెయిన్‌ వద్ద 7.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతోపాటుగా ఈ రోజు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు ఎన్‌సిఎంఎస్‌ వెదర్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, బలమైన గాలులు వీస్తుండడంతో ధూళి కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందనీ, ఈ కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ అండ్‌ సెస్మాలజీ పేర్కొంది. డిసెంబర్‌ 4 నుంచి 8 వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఎన్‌సిఎంఎస్‌ అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లోనూ వాతావరణం ఇదే స్థాయిలో కొనసాగనుంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ పెరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com