అమిటీ యూనివర్శిటీ దుబాయ్ United Arab Emirates ప్రాంతీయ గ్రందాలయ సమావేశాన్ని నిర్వహించినది

- December 05, 2017 , by Maagulf
అమిటీ యూనివర్శిటీ దుబాయ్ United Arab Emirates ప్రాంతీయ గ్రందాలయ సమావేశాన్ని నిర్వహించినది

దుబాయ్:అమిటీ యూనివర్శిటీ దుబాయ్, మంగళవారం, నవంబర్ 28, 2017 న డిజిటల్ యుగంలో సమాచార అక్షరాస్యతపై ఒక వర్క్ షాప్ ను ప్రారంభించింది. విశ్వవిద్యాలయ ప్రదాన గ్రంథాలయ పాలకులు సమ్మేట సంతోష్ గౌడ్,  ఈ వర్క్ షాప్ ను ప్రారంభించారు. 

అమిటీ యూనివర్శిటీ దుబాయ్ లైబ్రరీలో 80 మందికి పైగా సమాచార నిపుణులు మరియు లైబ్రేరియన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  అమిటీ యూనివర్శిటీ దుబాయ్ యొక్క ప్రో-వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్. రామచంద్రన్ హాజరైనవారిని స్వాగతించారు మరియు వారితో  21 వ శతాబ్దం యొక్క సమాచార ఛానెళ్లు మరియు డిజిటల్ స్థానికులు పాల్గొన్న వారి దృష్టిని పంచుకున్నారు. 

డిజిటల్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ Vs ప్రింట్ పాఠ్యపుస్తకాలు మరియు మిలీనియల్స్ కోసం ఇన్ఫర్మేషన్ లిటరసీ వంటి కార్యక్రమాలు టెక్ నాలెడ్జ్ బృందం ద్వారా వివిధ సమావేషాలు ప్రేక్షకులకు అందించబడ్డాయి. ప్రతి సెషన్ తరువాత, సమర్పకులు Q & A  కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు డిజిటల్ యుగంలో వివిధ లైబ్రరీ సందర్భాలలో వారి దృక్కోణాలను పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి ప్రధాన గ్రంథాలయ పాలకులు సమ్మేట సంతోష్ గౌడ్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com