టీవీల్లో కండోమ్ వాణిజ్య ప్రకటనలకు రాత్రివేళల్లోనే అనుమతి

- December 05, 2017 , by Maagulf
టీవీల్లో కండోమ్ వాణిజ్య ప్రకటనలకు రాత్రివేళల్లోనే అనుమతి

న్యూఢిల్లీ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో టీవీల్లో కండోమ్ లపై వాణిజ్య ప్రకటనలను రాత్రివేళల్లోనే అనుమతించాలని అడ్వైర్టైజింగ్ స్టాండర్స్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) సంచలన సూచన చేసింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరుగంటల లోపు సమయంలోనే టీవీల్లో కండోమ్ వాణిజ్య ప్రకటనలు వేయాలని ఏఎస్‌సీఐ సూచించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో టీవీల్లో కండోమ్ వాణిజ్యప్రకటనలు రాత్రివేళ పెద్దలు మాత్రమే చూసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వశాఖ ఏఎస్‌సీఐకి సూచించింది. కండోమ్ పై టీవీల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ సమీక్షించి విషయాన్ని ఏఎస్‌సీఐ దృష్టికి తెచ్చింది. సన్నీలియోన్ కండోమ్ వాణిజ్య ప్రకటన గురించి మహారాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటనల విభాగం యొక్క సుప్రీం స్వీయ-నియంత్రణ సంస్థ అయిన ఏఎస్‌సీఐ కు ఫిర్యాదు చేసింది. కండోమ్ ప్రకటనలు రాత్రివేళల్లో మాత్రమే ప్రసారమయ్యేలా చూడాలని అన్ని టెలివిజన్ చానెళ్లకు తాము సలహా ఇస్తామని ఏఎస్‌సీఐ పేర్కొంది. వాణిజ్య ప్రకటనల్లో ముఖ్యంగా మహిళల చిత్రణలో అసభ్యత, అశ్లీలత లేకుండా చూడాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com