విజయవంతంగా 'ఆకాశ్' ప్రయోగం

- December 05, 2017 , by Maagulf
విజయవంతంగా 'ఆకాశ్' ప్రయోగం

బాలాసోర్‌: ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సూపర్‌సోనిక్‌ క్షిపణి 'ఆకాశ్‌'ను భారత్‌ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 25 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ అస్త్రంలో తొలిసారిగా స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ను ఉపయోగించారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌) నుంచి ఈ పరీక్ష జరిగింది. ఇందులో మానవరహిత విమానాన్ని ఈ క్షిపణి లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను నేలకూల్చే ఎలాంటి అస్త్రాన్నైనా రూపొందించే సామర్థ్యం భారత్‌ సొంతమైంది. ఆకాశ్‌ వ్యవస్థ.. యుద్ధవిమానాలు; క్రూయిజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులను నేలకూల్చగలదు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను నాశనం చేయగలదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో).. దీన్ని రూపొందించింది. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌ రెడ్డి తాజా పరీక్షను పర్యవేక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com