అమెరికా విధానాలను తప్పు పట్టిన భారత్‌, చైనా

- December 05, 2017 , by Maagulf
అమెరికా విధానాలను తప్పు పట్టిన భారత్‌, చైనా

బీజింగ్‌: అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక, వీసా వ్యతిరేక విధానాలను భారత్‌, చైనా తప్పు పట్టాయి. రెండు దేశాల ప్రణాళికా సంస్థల మూడో వార్షిక సమావేశాలను పురస్కరించుకుని భారత్‌, చైనా ఉన్నతాధికార వర్గాలు మంగళవారం ఈ వ్యాఖ్య చేశాయి. అమెరికా అనుసరిస్తున్న చర్యలు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు మేలు చేయవని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అమెరికా అయినా, ఐరోపా అయినా అనుసరించే రక్షణాత్మక విధానాలను తోసిపుచ్చడానికి భారత్‌-చైనా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అమెరికా విధానాలు మిగిలిన ప్రపంచాన్ని ప్రభావితం చేసేవిగా ఉన్నాయని 'చైనా అభివృద్ధి పరిశోధన కేంద్రం' అధ్యక్షుడు లీ వెయ్‌ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రజాకర్షక విధానాలను విడనాడాలని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com