అమెరికా విధానాలను తప్పు పట్టిన భారత్, చైనా
- December 05, 2017
బీజింగ్: అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక, వీసా వ్యతిరేక విధానాలను భారత్, చైనా తప్పు పట్టాయి. రెండు దేశాల ప్రణాళికా సంస్థల మూడో వార్షిక సమావేశాలను పురస్కరించుకుని భారత్, చైనా ఉన్నతాధికార వర్గాలు మంగళవారం ఈ వ్యాఖ్య చేశాయి. అమెరికా అనుసరిస్తున్న చర్యలు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు మేలు చేయవని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. అమెరికా అయినా, ఐరోపా అయినా అనుసరించే రక్షణాత్మక విధానాలను తోసిపుచ్చడానికి భారత్-చైనా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అమెరికా విధానాలు మిగిలిన ప్రపంచాన్ని ప్రభావితం చేసేవిగా ఉన్నాయని 'చైనా అభివృద్ధి పరిశోధన కేంద్రం' అధ్యక్షుడు లీ వెయ్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రజాకర్షక విధానాలను విడనాడాలని చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి