ఆర్డర్ చేస్తే చాలు ఇకపై శ్రీవారి లడ్డూ ఇంటి ముంగిలికే

- December 05, 2017 , by Maagulf
ఆర్డర్ చేస్తే చాలు ఇకపై శ్రీవారి లడ్డూ ఇంటి ముంగిలికే

తిరుమల పవిత్రతను పెంచాల్సిన టీటీడీ ధర్మకర్తలు.. రివర్స్ గేర్లో వెళ్తున్నారా? పాలకమండలి తీసుకునే ఒక్కో నిర్ణయమూ చిత్రాతివిచిత్రంగా వుంటున్నాయంటూ ఎప్పటికప్పుడు విమర్శలు పడిపోతున్నాయి. ముఖ్యంగా శ్రీవారి మహాప్రసాదం 'లడ్డూ' విక్రయాల దగ్గర టీటీడీ అపహాస్యంపాలవుతోంది. లడ్డూ ప్రసాదం బ్లాక్ మార్కెటింగ్ కొంతవరకు కంట్రోల్లోకొచ్చినా.. వాటి పంపిణీ విషయంలో ఇప్పటికీ హేతుబద్ధత సాధించలేదు. తాజాగా ధర విషయంలో రచ్చకెక్కింది టీటీడీ. లోటు బడ్జెట్ కారణంగా లడ్డూపై సబ్సిడీ తగ్గించి.. ధర పెంచాలన్న ప్రతిపాదన వివాదాస్పదమైంది.

అయితే.. అంతకంటే వివాదాస్పద నిర్ణయం ఇటీవలే ఇంకోటి తీసుకుంది టీటీడీ. 'టేక్ అవే' అంటూ లడ్డూల పార్శిల్ పద్దతికి ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. ఇకపై పెళ్లి, రిసెప్షన్, వ్రతం లాంటి ప్రయివేటు కార్యక్రమాలకు సైతం ప్రసాదాన్ని పంచుకోవచ్చట. ముందస్తుగా ఆర్డర్ చేస్తే..

శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాల్ని పంపమన్న చోటికి పంపుతామంటూ దేవస్థానం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒక్కో లడ్డు రూ. 50 చొప్పున కోరినవాళ్లకు కోరినన్ని అందజేస్తామంటోంది టీటీడీ. శ్రీవారి ప్రసాదాన్ని ఒక కమర్షియల్ ఫుడ్ ఐటెంగా మార్చేసిన టీటీడీ ఘనకార్యం మీద అన్ని వైపుల నుంచి విమర్శలు పడిపోతున్నాయి.

స్విగ్గి లాంటి ఆన్ లైన్ ఫుడ్ సర్వీసుల్లో కూడా శ్రీవారి లడ్డూను రిజిస్టర్ చేయమంటూ కొంతమంది సిఫార్సులు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com