దుబాయ్‌లో టీచింగ్ జాబ్: 228,000 వరకు వార్షిక జీతం
- December 05, 2017
యూకేలో టీచర్‌గా పనిచేస్తున్నవారెవరైనా, దుబాయ్‌లో అదే ప్రొఫెషన్‌లో కొనసాగాలనుకుంటున్నారా? వారికి గోల్డెన్ ఛాన్స్ ఇది. మ్రుఖ బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ దుబాయ్‌లో టీచర్ల కోసం ప్రకటన వెలువరించింది. యూకే న్యూస్ పేపర్‌లో ఈ ప్రకటన వచ్చింది. 14,000 (నెలవారీ జీతం) నుంచి 19,0000 వరకు ఆఫర్ చేస్తోంది స్కూలు యాజమాన్యం. క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి జీతం శ్రేణి ఆధారపడి ఉంటుంది. వార్షిక వేతనం లెక్కేస్తే 168,000 నుంచి 228,800 వరకు ఉంటుంది. బుర్జ్ ఖలీఫా నుంచి 20 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఈ స్కూల్ ఉంది. బ్రిటిష్ కరికులమ్ ఈ స్కూల్‌లో పాటిస్తున్నారు. ఇంటర్వ్యూలు లండన్‌లో 2018 జనవరి 19న జరుగుతాయి. ఎర్లీ ఇయర్స్ టీచర్స్, లోవర్ ప్రైమరీ - అప్పర్ ప్రైమరీ టీచర్స్, మేథ్స్ టీచర్స్, ఇంగ్లీష్, సన్స్ టీచర్స్, ఐసీటీ, స్టెమ్ / స్టీమ్, మ్యూజిక్, పీఈటీ టీచర్స్, బిజినెస్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్ టీచర్స్, డి అండ్ టి టీచర్స్, ఎస్‌ఇఎన్ టీచర్స్, ఫుల్లీ క్వాలిఫైడ్ ఇఎఎల్ టీచర్స్ (ప్రైమరీ అడ్ సెకెండరీ ఇంటర్వెన్షన్) తదితర పోస్టుల కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఉచితంగా ఫర్ణిష్డ్ అకామడేషన్ ఇస్తారు. సంవత్సరానికోసారి ఉచితంగానే ఫ్లైట్ టిక్కెట్, ఫ్రీ ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్, ఫ్రీ వీసా, ఫ్రీ హెల్త్ ఎగ్జామ్, ఫ్రీ ట్యూషన్ (ఒక చిన్నారికి), వన్ టెర్మ్ రిలొకేషన్ అలవెన్స్ 2,000 దిర్హామ్‌లు, ఎండ్ ఆఫ్ సర్వీస్ గ్య్రాటీ - యూఏఈ లేబర్ చట్టం ప్రకారం, 2 ఏళ్ళ కాంట్రాక్ట్ రెన్యువబుల్, స్కోప్ ఫర్ కెరీర్ ప్రొగెషన్ వంటి ఆఫర్స్ ఇస్తున్నారు. అప్ టు డేట్ సివి కలిగి ఉండాలి, చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్ (కనీసం ఏడాది వాలిడిటీ) తప్పనిసరి. డిగ్రీ మరియు టీచింగ్ క్వాలిపికేషన్, క్లీన్ డిబిఎస్ / పోలీస్ చెక్, 2 ఔట్ స్టాండింగ్ రిఫెరెన్సెస్ (ఒకటి ప్రస్తుత ప్రిన్సిపాల్ నుంచి), అటెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ తప్పనిసరి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి