జిసిసి నుంచి వీడి ...వేరే కుంపటి పెట్టె యోచనలో యుఏఈ, సౌదీ అరేబియా
- December 07, 2017_1512657667.jpg)
యుఏఈ: ' కలిసి ఉంటే కలదు సుఖం ' అంటూ ఘనంగా ఏర్పాటైన గల్ఫ్ సహకార సమాఖ్యలో (జిసిసి) లో ముసలం పుట్టింది. నేతల మధ్య లుకలుకలు మొదలై చివరకు తాము వేరుపడుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ప్రకటించాయి. సౌదీ అరేబియాతో కలిసి తాము ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది. జిసిసి నుండి వేరుపడి మరో ‘సంయుక్త సహకార మండలి’ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆమోదించినట్లు ఎమిరేట్స్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో వివరించింది. అయితే ఎమిరేట్స్ ప్రతిపాదనపై సౌదీ అరేబియా వెంటనే స్పందించలేదు అన్నట్లు తెలుస్తుంది. కొత్త మండలిలో ఎమిరేట్స్, సౌదీ అరేబియా మధ్య సైనిక, రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే అంశంపై మిత్రదేశాలతో సమన్వయపరచి సహకారాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమిరేట్స్ విదేశాంగశాఖ తన ప్రకటనలో వివరించింది. అయితే ఈ కొత్త కూటమిలోకి ఇతర గల్ఫ్ దేశాలకు కూడా ఆహ్వానం ఉందా లేదా అన్నది మాత్రం తమ ప్రకటనలో ప్రస్తావించలేదు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి