నేపాల్ లో భూకంపం...
- December 08, 2017
కాఠ్మండూ: నేపాల్ దొలాఖా జిల్లాలో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం ఆ ప్రాంత వాసులను వణికించింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 5.2 పాయింట్ల తీవ్రతను నమోదు చేసినట్లు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. ఈ ప్రకంపనల కేంద్రం దొలాఖా జిల్లాలోని జిరి వద్ద 27.68 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.19 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య భూగర్భంలో 10 కి.మీ లోతులో వున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రకంపనల ప్రభావం రాజధాని ఖాట్మండులో కూడా కన్పించింది. 2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో దాదాపు 9 వేల మందికి పైగా ప్రజలను బలి తీసుకున్న పెను భూకంపం తరువాత వివిధ ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి