ఇల్లీగల్‌ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌: 1000 దిర్హామ్‌ల జరీమానా

- December 09, 2017 , by Maagulf
ఇల్లీగల్‌ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌: 1000 దిర్హామ్‌ల జరీమానా

భవనాలపై నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల్ని, పోస్టర్లను అతికిస్తే భారీ జరీమానాల్ని ఎదుర్కొనాల్సి వస్తుందని దుబాయ్‌ మునిసిపాలిటీ హెచ్చరించింది. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో దుబాయ్‌ మునిసిపాలిటీ ఈ విషయాన్ని పేర్కొంది. నిబంధనల్ని అతిక్రమించేవారిపై 1000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించబడుతుందని ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. బిల్డింగ్‌ ఫేసెడ్స్‌, బస్‌ షెల్టర్స్‌, లైట్‌ పోల్స్‌, స్ట్రీట్‌ రౌండెబౌట్స్‌ వంటి చోట్ల ఈ తరహా పోస్టర్లు, అడ్వర్‌టైజ్‌మెంట్స్‌తో ఆ పరిసరాలు జుగుప్సాకరంగా మారిపోతున్నట్లు దుబాయ్‌ మునిసిపాలిటీ పేర్కొంది. రస్‌ అల్‌ ఖైమాలో 2,000 దిర్హామ్‌ల నుంచి 10,000 దిర్హామ్‌ల వరకు వసూలు చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com