'సీ ప్లేన్'కు ప్రయోగ పరీక్షలు
- December 09, 2017
దిల్లీ: నీటిపైనా దిగే, ఎగిరే విమానం 'సీ ప్లేన్'కు స్పైస్ జెట్ శనివారం ప్రయోగ పరీక్షలు నిర్వహించింది. ఇలాంటి వంద విమానాలను ఏడాదిలోగా అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. వీటి విలువ రూ.2,579 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజుల సమక్షంలో ముంబయిలోని గిర్‌గామ్ చౌపతి తీరంలో దీన్ని ప్రయోగాత్మకంగా నడిపింది. జపాన్ సంస్థ సిటౌచీతో కలిసి ఈ విమానాలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం జరిపినవి రెండో దశ పరీక్షలని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మౌలిక సదుపాయాలు అంతగా అందుబాటులోలేని చిన్నచిన్న నగరాలు, పట్టణాలకు వైమానిక సేవలు చేరువచేయడమే లక్ష్యంగా ఈ విమానాలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. వీటిలో పది నుంచి 14 మంది వరకూ కూర్చొని ప్రయాణించే వీలుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







