ప్రైవేటు పాఠశాలలకు నియంత్రణ : కొత్త చట్టాన్ని జారీ చేసిన ఎమిర్

- November 16, 2015 , by Maagulf
ప్రైవేటు పాఠశాలలకు నియంత్రణ  : కొత్త చట్టాన్ని జారీ చేసిన ఎమిర్

కతార్ లో అధికారిక అనుమతి లేకుండా ప్రైవేటు పాఠశాలలు  ప్రారంభించినా, నడిపినా రెండు సంవత్సరాల వరకు జైలు 

శిక్ష, ఒక లక్ష కతార్ రియళ్ళ జరిమానా విధింప బడుతుందని హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని, లా 

నెం. 23 ఫర్ 2015 జారీ చేసారు.  ఒక సంవత్సర కాల పరిధి వరకు ఈ చట్ట పరిధికి ప్రైవేటు పాఠశాలలు  లోబడి ఉండాలని, 

అనంతరం సంబంధిత మంత్రి మరల పొడిగిస్తారని ప్రకటించారు.  అంటే కాకుండా, నిబంధనల అతిక్రమణకు పాల్పడిన 

పాఠశాలలను న్యాయస్థానం మూసివేయించ వచ్చని; ఈ వివాదం, అపరాధి ఖర్చులపై స్థానిక పత్రికలలో 

ప్రకటించబడుతుందని కూడా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com