అమెరికాలో కూలిన లఘు విమానం
- December 10, 2017
వాషింగ్టన్: అమెరికాలోని శాండీగో నగరంలో ని ఓ ఇంటిపై లఘు విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...శాండీగో నగరంలో ఓ ఇంటిపై లఘు విమానం కూలిపోయింది.
దీంతో, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఇద్దరు వ్యక్తులు ఈ మంటల్లో కాలిపోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. విమానం కూలిన ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం పూర్తిగా కాలిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. విమానం కూలిన ప్రాంతం శాండీగో విమానాశ్రయం నుంచి కూతవేటు దూరంలో ఉంటుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







