టీవీ5 చేతికి అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ రైట్స్
- December 12, 2017
పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న అజ్ఞాతవాసి మూవీ ఫై మాములు అంచనాలు లేవు..ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని అంత ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబదించిన ఒక్కో స్టిల్ బయటకు వస్తుంటే అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్ర ఆడియో ను ఈ నెల 21 న హెచ్ఐసిసి లో జరపబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఆడియో ఫంక్షన్ కు సంబదించిన రైట్స్ ను ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 5 వారు దక్కించుకున్నారని తెలుస్తుంది. దాదాపు రూ. 85 లక్షలకు ఈ రైట్స్ సొంతం చేసుకున్నారట. పైగా ఇది సోలో లైవ్ ప్రసారం కావడం విశేషం. వాస్తవానికి అజ్ఞాతవాసి శాటిలైట్ హక్కులు జెమిని టీవీ వారు దక్కించుకున్నారు. వారే ఈ ఆడియో ఫంక్షన్ ను కవర్ చేయాలి కానీ వారు కాకుండా టీవీ 5 కి ఆ ఛాన్స్ వెళ్ళింది. మరి చివరికి వారు మాత్రమే లైవ్ చేస్తారా లేక వేరే వారికీ లింక్స్ ఇస్తారా అనేది చూడాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల