వరుస సినిమాలతో దూసుకొస్తున్న విజయ్

- December 12, 2017 , by Maagulf
వరుస సినిమాలతో దూసుకొస్తున్న విజయ్

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి, అలియాస్ విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులుతో ఫేమ్ తెచ్చుకున్న విజ్ దేవరకొండ, అర్జున్ రెడ్డితో క్రేజ్ పెంచుకున్నాడు. దీంతో ఈ యంగ్ హీరో కొత్త సినిమాల కోసం, స్పెషల్ గా యూత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మూడు చిత్రాలతో సందడి చేయడానికి విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నాడు.

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి, ఎవడే సుబ్రమణ్యంలో కీలక పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్ళిచూపులుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత చేసిన మూవీ సక్సెస్ కాలేకపోయినా.... ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్ గా మారాడు. ఈ సినిమాలో విజయ పెర్ఫార్మెన్స్ కి ఫిదా కాని యూత్ ఆడియన్స్ లేరు. అర్జున్ రెడ్డి తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఇమేజ్ పెరిగింది. దీంతో అతని నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. యూత్ ఆడియన్స్ తన సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ విజయ్ మాత్రం నెక్స్ట్ సినిమా అర్జున్ రెడ్డి కంటే ఎక్కువ స్థాయిలో ఉండేలా, అలాగే డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. వచ్చే ఏడాదిలో మొదటి మూడు నాలుగు నెలల్లోనే మూడు సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 

నెక్స్ట్ ఇయర్ విజయ్ దేవరకొండ బ్యాక్ టూ బ్యాక్ తన సినిమాలతో సందడి చేయబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక చేస్తున్నాడు. ఇక సినిమాటోగ్రాఫర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ రెండింటితో పాటు సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ 2018 మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎమైనా తక్కువ టైమ్ లోనే విజయ్ దేవరకొండ కుర్ర హీరోలకు పోటీగా మారాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com