బహ్రెయిన్‌లో 82 మంది ఖైదీల విడుదల

- December 12, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో 82 మంది ఖైదీల విడుదల

మనామా: కింగ్‌ మమాద్‌ బిన్‌ ఖలీఫా, 82 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ రాయల్‌ డిక్రీని విడుదల చేశారు. నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా కింగ్‌ హమాద్‌ ఈ రాయల్‌ డిక్రీని విడుదల చేయడం జరిగింది. వివిధ కారణాలతో నేరాలకు పాల్పడి, ఇతరత్రా కేసుల్లో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి, ఈ క్షమాభిక్షతో ఊరట కలగనుంది. తిరిగి వారంతా సమాజంలో భాగమై, సమాజ ఉన్నతికి కృషి చేయాలని, సన్మార్గంలో నడిచి బహ్రెయిన్‌ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కింగ్‌ హమాద్‌ ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com