మళ్లీ మార్కెట్లోకి ఎయిర్‌ డెక్కన్‌ సేవలు

- December 13, 2017 , by Maagulf
మళ్లీ మార్కెట్లోకి ఎయిర్‌ డెక్కన్‌ సేవలు

దిల్లీ: రూపాయికే విమాన టికెట్టా..? అంత తక్కువా? అని ఆశ్చర్యపోతున్నారా..! దేశీయ తొలి బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌డెక్కన్‌ మళ్లీ వైమానిక మార్కెట్లోకి రానుంది. త్వరలోనే ఈ ఎయిర్‌లైన్‌ తిరిగి సేవలను ప్రారంభించనుందట. అయితే ప్రచారంలో భాగంగా కొందరు లక్కీ ప్రయాణికులకు రూపాయికే విమాన టికెట్‌ ఇవ్వనుందట.
చౌక ధరలకే విమాన ప్రయాణాన్ని అందించేందుకు 2003లో జీ.ఆర్‌. గోపినాథ్‌ ఎయిర్‌డెక్కన్‌ విమానయాన సంస్థను ప్రారంభించారు. 2008లో ఈ సంస్థ ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులకు ఎక్కువవడంతో 2012లో ఈ సంస్థ సర్వీసులను నిలిపివేసింది. కాగా.. త్వరలోనే ఈ ఎయిర్‌లైన్‌ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుందట. ఈ మేరకు ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపినాథ్‌ తెలిపారు. ఈ నెలాఖరులో ముంబయి, దిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్‌ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలు నడపనున్నట్లు తెలిపారు.

డిసెంబర్‌ 22న ముంబయి నుంచి నాసిక్‌కు తొలి ఎయిర్‌డెక్కన్‌ విమానం నడపనున్నారట. ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు తక్కువ ధరలకే విమాన టికెట్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్‌ కన్నా తక్కువగా 40 నిమిషాల ప్రయాణానికి రూ.1400 ఛార్జీ చేయనున్నారట. అంతేగాక.. ప్రారంభ రోజుల్లో కొందరు లక్కీ ప్రయాణికులకు కేవలం రూ.1కే విమాన టికెట్‌ అందించనున్నట్లు గోపినాథ్‌ తెలిపారు. జనవరి చివరి వరకు మిగతా మూడుచోట్ల కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎయిర్‌డెక్కన్‌ పూర్తి షెడ్యూల్‌పై మాత్రం స్పష్టత లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com