న్యూజెర్సీ అటార్నీ జనరల్‌గా జాతీయుడు.!
- December 13, 2017
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర అటార్నీ జనరల్‌గా సిక్కు జాతీయుడు గుర్బీర్ ఎస్ గ్రేవాల్ కొత్త అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. గతంలో న్యూయార్క్, న్యూజెర్సీలలో అసిస్టెంట్ అమెరికా అటార్నీగా పనిచేసిన గ్రేవాల్‌ను న్యూజెర్సీ గవర్నర్‌గా ఎన్నికైన ఫిల్ మర్ఫీ మంగళవారం అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈ నియామకంతో అమెరికాలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రానికి అటార్నీ జనరల్‌గా నియమితుడైన సిక్కు అమెరికన్‌గా గ్రేవాల్ చరిత్ర సృష్టించారు. కాగా తనతో పాటు ఎన్నో వలస కుటుంబాలకు ఎంతో ఇచ్చిన ఈ దేశం రుణం తీర్చుకోవడానికి తాను ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు గ్రేవాల్ తెలిపారు. మిగతా అందరిలాగానే తాను కూడా గతంలో విద్వేషాన్ని, అసహనాన్ని స్వయంగా ఎదురుకున్నానని, అయినప్పటికీ నిష్పాక్షికమైన సమ సమాజంలో తామంతా జీవించేలా చూడటం కోసం కృషి చేయాలని అనుకుంటున్నానని ఈ ప్రకటన అనంతరం గ్రేవాల్ పేర్కొన్నారు. కాగా గ్రేవాల్‌ను అటార్నీ జనరల్‌గా నియమించడం పట్ల దక్షిణ ఆసియా బార్ ఆసోయేషన్ హర్షం వ్యక్తం చేసింది. 1999లో కాలేజ్ ఆఫ్ విలియం అండ్ మేరీ, మార్షల్ వైత్ స్కూల్ ఆఫ్ లా నుంచి గ్రేవాల్ లా డిగ్రీ పొందారు. తన లీగల్ కెరియర్‌లో అత్యధిక భాగం ప్రజాసేవలోనే గడిపిన గ్రేవాల్ బెర్జన్ కౌంటీ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







