అమెరికాలో లోకేష్ పర్యటన..
- December 14, 2017
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. లోకేశ్ ఆధ్వర్యంలో శాన్ఫ్రాన్సిస్కో లోని గూగుల్ ఎక్స్ కార్యాలయంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో ఏపీ ఐటి శాఖ అధికారులు, గూగుల్ ఎక్స్ కంపెనీ సీఈఓ ఆస్ట్రో టెల్లర్ పాల్గొన్నారు. ఇప్పటి వరకూ అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఎక్కడా కార్యకలాపాలు ప్రారంభించని గూగుల్ ఎక్స్.. ఒప్పందం లో భాగంగా ఏపీలో డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించనుంది. దీంతో.. అది మొదటిసారి ఇండియాలో అడుగు పెడుతున్నట్లవుతుంది. త్వరలోనే విశాఖపట్నంలో గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే.. వేమోగా పిలిచే.. డ్రైవర్ లెస్ కార్, అధునాతన గూగుల్ గ్లాస్సెస్, బేలూన్స్ ఎగరవేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం పొందే.. ప్రొజెక్ట్ లూన్ లాంటి టెక్నాలజీలను గూగుల్ ఎక్స్ అభివృద్ధి చేసింది. ఏపీలో ఏర్పాటు చేయబోయే సెంటర్లో అధునాతన టెక్నాలజీలపై పరిశోధన.. అభివృద్ధి చేయనుంది.
ఫైబర్ గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్‌ను గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది. దీంతో ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్‌తో గ్రామీణ ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్.. అతి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. మొత్తానికి ఏపీకి గూగుల్ ఎక్స్ రాకతో కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







