ఇరాన్‌పై ట్రావెల్ బ్యాన్: ప్రపోజల్‌పై ఓట్ వేయనున్న ఎంపీ
- December 15, 2017మనామా: ఇరాన్‌పై ట్రావెల్ బ్యాన్ విధించే దిశగా అర్జంట్ ప్రపోజల్ ఒకటి పార్లమెంటేరియన్స్‌తో టేబుల్ చేయబడింది. అరబ్ మరియు జిసిసి దేశాల అంతరంగిక విషయాల్లో ఇరాన్ అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటేరియన్స్ సూచిస్తున్నారు. అయితే షురా కౌన్సిల్ మరియు రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ ఎఫైర్స్ మినిస్టర్ ఘానిమ్ అల్ బుయైనైన్ రాతపూర్వకమైన వివరణలో, ట్రావెల్ బ్యాన్ ఇప్పటికే ఇరాన్‌పై బహ్రెయిన్‌లో ఉందని తెలిపారు. 2016, జనవరి 4న మినిస్టీరియల్ రిజల్యూషన్ ద్వారా బ్యాన్ అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. అయితే ఎంపీల బృందం మాత్రం రోడ్డు, జల మార్గం, వాయు మార్గం ఇలా ఏ మార్గం ద్వారా కూడా ఇరాన్‌తో సంబంధాలు కొనసాగకుండా ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. టెహ్రాన్‌లో సౌదీ ఎంబసీపై దాడులు, అలాగే మన్షాద్‌లోని కాన్సులేట్‌పై దాడుల నేపథ్యంలో కింగ్‌డమ్ నుంచి 48 గంటల్లోగా ఇరానియన్ డిప్లమాట్స్ వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు అల్ బుయైనైన్ చెప్పారు. మినిస్టర్ ఇచ్చిన సమాచారాన్ని గురువారం రివ్యూ చేస్తారు ఎంపీలు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







