నగర బస్సు మార్గాలకు తెలుగు పేర్లు

- December 15, 2017 , by Maagulf
నగర బస్సు మార్గాలకు తెలుగు పేర్లు

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది అమ్మభాషా ప్రియులు వీటికి హాజరవుతున్నారు. కార్యక్రమాలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నగర బస్సులు తిరిగే మార్గాలకు ప్రభుత్వం తెలుగు అక్షరాలతో పేర్లు పెట్టింది. ఉదాహరణకు 157వ మార్గానికి.. 'మార్గం-గ' అని పెట్టింది. నిత్యం బస్సులపై ఆంగ్ల పదాలను చూసే ప్రయాణికులకు ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నగరంలో జరుగుతున్న తెలుగు మహా సభలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, గవర్నర్లు విద్యాసాగరరావు, నరసింహన్‌ శుక్రవారం సాయంత్రం వేడుకలను ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com