రానున్న 24 గంటల్లో ఒమాన్ లో భారీ వర్షపాతం: వాతావరణ సూచన

- December 16, 2017 , by Maagulf
రానున్న 24 గంటల్లో ఒమాన్ లో  భారీ వర్షపాతం: వాతావరణ సూచన

మస్కట్ : ఒమాన్ లో వివిధ ప్రాంతాలలో శనివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడటంతో అనేక ప్రాంతాల్లో వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. మస్కట్ గవర్నరేట్ పరిధిలో శనివారం సాయంత్రం అనేక ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. దీంతో  ముస్హాందాం, ఇజ్కీ మరియు ఉత్తర బాటినాహ్లోని సోఖర్, లిఖ్ మరియు సోహార్లలో వర్షపాతం కారణంగా ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. ఇజ్కీలోని ఆల్ షిబాక్ ప్రాంతంలోని వడీస్ ను ఆల్కియా ఖ్త్య్రటైన్  గ్రామానికి వెళ్లే రహదారిపై ఏర్పడిన ట్రాఫిక్ రద్దే ఆ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇజ్కీలో వర్షం కారణంగా ఏర్పడిన నీటి ప్రవాహాల కారణంగా మూడు వాహనాలు మునిగిపోయాయి. దఖ్లీయాలో మరో మూడు వాహనాలు సామీయిల్లోని వాడి అల్ ఉక్లో నిండిపోయిన జలాలలో  కొట్టుకుపోయాయి.ఆ వాహనాలలో ప్రయాణీకులు అందర్నీ  రక్షించారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదవుతున్నట్లు సివిల్ ఎవియేషన్ ఫర్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పీఏసీఏ) అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆదివారం ( నేడు ) మరియు సోమవారం ( రేపు ) వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ హెచ్చిరిక తెలిపింది, "ముసాండం, ఉత్తరం మరియు దక్షిణాన బాటినా, బురైమి, ధహిరా, దఖాలియా, ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో ఆకాశంలో పాక్షికంగా మేఘాలు కనిపిస్తాయి. మరియు తాజా గాలులు వర్షాలతో కూడిన  వడగళ్ళు  షార్కియా, అల్ వస్తా మరియు ధోఫర్ల గా వర్షం కురువబోతున్నట్లు వాతావరణశాఖాధికారులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com