ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన శివాజీ...
- May 02, 2015
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఈరోజు గుంటూరులో 10గంటల నుండి నిరాహార దీక్ష చేపడుతున్నట్లు హీరో శివాజీ స్పష్టం చేశారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చివరి వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. ప్రజల కోసమే ఈ పోరాటం చేపడుతున్నానని, ఎవరు మద్దతు ఇచ్చినా... ఇవ్వకపోయినా ఉద్యమం కొనసాగుతుందన్నారు. తనది పోరాటమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. తన పోరాటం అన్ని పార్టీల్లో ఉన్నవారి పిల్లల భవిష్యత్ కోసమేనని చెప్పారు. తాను చేసే ఈ దీక్షతో ఎవరికీ ఇబ్బంది ఉండదని, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. తాను దీక్ష చేసే స్థలం నుంచి ఖాళీ చేయిస్తే మరో చోటైనా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. గుంటూరు వదిలి మాత్రం వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చినా తాను సామాజిక కార్యకర్తలానే పనిచేస్తానని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







