పెరుగుతో ఉపయోగాలు ఎన్నో చూడండి
- December 18, 2017
పాలు, పెరుగు అంటే మీకు పడవా అయితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు పడకపోయినా.. పెరుగును ఆహారంలో చేర్చుకుంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచినట్లవుతుంది. పెరుగును రోజుకు రెండు కప్పులు తీసుకుంటే బరువు తగ్గుతారు. పెరుగులో వున్న క్యాల్షియం శరీరంలో కార్టిసాల్ అనే స్టిరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రణలో వుంచుతుంది.
ఈ కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువైనా.. సమతౌల్యం కోల్పోయినా హైపర్ టెన్షన్, ఒబిసిటీ లాంటివి దూరమవుతాయి. పెరుగులోని పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. పెరుగులో శరీరానికి మేలుచేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది, శరీరానికి చెడుచేసే బ్యాక్టీరియాను నివారిస్తుంది.
పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను, పళ్లను బలంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పెరుగుకి రక్తపోటుని అదుపులో ఉంచే శక్తి ఉంది. రక్తనాళాల్లో, శరీరంలో కొవ్వు చేరకుండా నివారించగలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చర్మానికి కూడా పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని జింక్, విటమిన్ ఇ, ఫాస్పరస్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. పెరుగు, సున్నిపిండి పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగిస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. పెరుగును తలకు ప్యాక్‌లా వేసుకుంటే చుండ్రు తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి