తమిళనాడు, కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ...!!
- December 19, 2017
ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించారు. ఓఖీ తుపాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోయిన కన్యాకుమారిని సందర్శించారు. వరద నష్టంపై గవర్నర్, సీఎం పళనీ స్వామి, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓఖీ తుపాను నష్టంపై ప్రధానికి నివేదిక సమర్పించారు ముఖ్యమంత్రి పళనీ స్వామి. 4 వేల కోట్ల రూపాయల సాయం చేయాలని విన్నవించారు. వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రధాని పరిశీలించారు. ఓఖీ తుపాను సమయంలో కన్యాకుమారి చిగురుటాకులా వణికిపోయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. అప్పటి బీభత్సానికి సంబంధించిన ఫోటోలను అధికారులు ప్రదర్శించారు. తమిళనాడుకు కావల్సినంత వరద సాయం చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల