టెహ్రాన్‌కి విమాన సేవల్ని నిలిపివేయనున్న ఎతిహాద్
- December 19, 2017
యు.ఏ.ఈ:ఎతిహాద్ ఎయిర్ వేస్ , టెహ్రాన్‌కి విమానాల్ని నిలిపివేయనుంది. ఎతిహాద్ తీసుకున్న ఈ నిర్ణయంతో 2018 జనవరి 24 నుంచి టెహ్రాన్‌కి విమాన సేవలు నిలిచిపోతాయి. ఇరాన్ రాజధానికి ఎతిహాద్ ప్రస్తుతం నడుపుతున్న ఐదు వీక్లీ విమానాల్ని డిసెంబర్ 25 నుంచి జనవరి 23 వరకు వారానికి రెండు మాత్రమే నడపాలని, జనవరి 24 తర్వాత పూర్తిగా సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. ఈ రూట్ ఎందుకు సస్పెండ్ చేస్తున్నారన్న విషయమ్మీద మాత్రం అధికార ప్రతినిథి స్పందించలేదు. స్ట్రేటజీ రివ్యూలో భాగంగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం శాన్‌ఫ్రాన్సిస్‌కో, డల్లాస్ - ఫోర్ట్‌కి కూడా విమాన సర్వీసుల్ని తగ్గించనుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కలిగే అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఆయా రూట్లలో ప్రయాణాల్ని రీ-బుక్ చేసుకోవడం లేదా చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఎతిహాద్ ఎయిర్‌లైన్స్. జనవరి 24 తర్వాత ప్రయాణాలకు మాత్రం పూర్తిగా రిఫండ్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







