విజయవాడలో ప్రారంభమైన కువైట్ కంపెనీ ఆల్హానా
- December 21, 2017
విజయవాడ: కువైట్లో 1984లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆల్హానా యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రస్తుతం ఇండియాలో తమ కార్యకలాపాలను విస్తృత పరచుకునేందుకు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆ సంస్థ కువైట్ చైర్మన్ అలీఅల్లా రాధీ, ఇండియా చైర్మన్ పల్లెం ఏసురత్నం కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో చైర్మన్ మాట్లాడుతూ కువైట్లో ప్రప్రథమంగా సివిల్ నిర్మాణాలతో ప్రారంభమైన కంపెనీ నేడు దాదాపు 2700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. అందులో వెయ్యి మంది ఇండియాకు చెందిన వారే ఉన్నారన్నారు. ఆకివీడుకు చెందిన ఏసురత్నం ప్రస్తుతం ఇండియా తరపున చైర్మన్గా ఉండడం కంపెనీకి మరింత గర్వకారణమన్నారు. ఈ సదస్సులో చైర్మన్ ఏసురత్నం, కంపెనీ ప్రతినిధి శ్యాంసన్ పొట్లా, కోనేరు కన్స్ట్రక్చన్స్ కంపెనీ చైర్మన్ విశ్వనాథం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







