హత్య, ఇంటిని తగలబెట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్‌

- December 21, 2017 , by Maagulf
హత్య, ఇంటిని తగలబెట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌: మద్యం సేవిస్తున్న సమయంలో తలెత్తిన తగాదా ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు, తమ సహచరుడ్ని అతి దారుణంగా హత్య చేశారు. తాము చేసిన హత్య వెలుగు చూడకుండా ఉండేందుకు, దాన్నొక ప్రమాదంలా చిత్రీకరించేందుకు నిందితులు మృతుడి ఇంటిని దహనం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు. అజైబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి నిందితుడ్ని చట్ట పరమైన చర్యల నిమిత్తం అప్పగించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com