క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
- December 22, 2017
ఇంతకాలం పరాధీన స్థితిలో ఉన్న తెలంగాణ స్వాధీన స్థితిలోకి వచ్చి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుందని, గత పాలకుల హయాంలో ఇలాంటి క్రిస్మస్ వేడుకలు ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్నగరంలో జరిగిన కిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహించడంలేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ, బోనాల పండుగలు అధికారికంగా నిర్వహిస్తు న్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పాత చర్చిలకు మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణం కోసం పది కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. వచ్చే క్రిస్మస్ నాటికి హైదరాబాద్‌లో క్రైస్తవ భవన్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. దీనికి కావాల్సిన డిజైన్లు చివరి దశలో ఉన్నాయని, టెండర్లను పిలిచి క్రైస్తవ భవన్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ లేదనీ, ప్రజలకు మేలుచేసే ప్రతీ పనిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. మనం కలలుగన్న బంగారు తెలంగాణ ఎంతో దూరంలో లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు రావడంపై ఆయన ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పూర్తయితే త్వరలోనే రాష్ట్రం హరిత తెలంగాణగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృధ్ధి, వివిధ పండుగలను అధికారికంగా ప్రభుత్వం జరుపుతున్న తీరును పరిశీలించడంతో పాటు టూరిజం శాఖకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునేందుకు గానూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఈనెల 28న హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. టూరిజం కార్పొరేషన్‌కు సంబంధించిన ఒప్పందాలతో పాటు తెలంగాణ-జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య మరికొన్ని అంశాలపై ఒప్పందాలు ఉంటాయని సీఎం చెప్పారు.
అన్ని వర్గాల అందిన విధంగానే క్రిస్టియన్ సోదరులకు అభివృద్ధి ఫలాలు అందుతాయని, పింఛన్లు, స్కాలర్షిప్లు అందుతాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్ సోదరులపై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. జీసెస్ జన్మస్థలం జెరూసలేమ్‌కు రాష్ట్రం నుంచి వేళ్లే భక్తులకు సబ్సిడీ ఇవ్వాలని క్రిస్టియన్ సోదరులు కోరుతున్నారు, దీనిపై ప్రభుత్వం చర్చించి త్వరలో ఓ ప్రకటన చేయనుందన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి