విశాఖ-అరకు మధ్య రైలు సర్వీసుల పునః ప్రారంభం

- December 22, 2017 , by Maagulf
విశాఖ-అరకు మధ్య రైలు సర్వీసుల పునః ప్రారంభం

విశాఖ: పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకు మధ్య శనివారం నుంచి ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ డీసీఎం (కోఆర్డినేషన్‌) తెలిపారు. ఈ సర్వీసులు జనవరి ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో బొర్రా-చిమిడిపల్లి స్టేషన్‌ల మధ్య 32వ టన్నెల్‌ వద్ద అక్టోబరు 6న కొండరాళ్లు పడడంతో వంతెన పిల్లర్‌ కూలిపోయి, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు, సిబ్బంది రెండు నెలలకుపైగా శ్రమించి 100 అడుగుల ఎత్తు ఉన్న వంతెన పిల్లర్‌ని పునర్నిర్మించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com