యూఏఈ పౌరులు వీసా లేకుండా చైనాకు సైతం వెళ్ళవచ్చు
- December 23, 2017
అబుదాబి:వీసా లేకుండా నేరుగా అనేక దేశాలకు ప్రయాణించే అవకాశం యూఏఈ తన దేశ ప్రజలకు అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టును జారీ చేస్తోంది. ఈ క్రమంలో మరింత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా యూఏఈ మారింది. వీసా లేకుండానే తమ దేశంలోకి యూఏఈ ప్రజలు ప్రయాణించేందుకు చైనా అంగీకరించింది. చైనాలోని ప్రాంతాలకు వీసా అనుమతి లేకుండానే ప్రయాణించవచ్చని వెల్లడించింది. యూఏఈ-చైనా మధ్య కుదిరిన సహకార ఒప్పందంలో భాగంగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపారవేత్తలు, ఇతర ముఖ్యమైన అవసరాల నిమిత్తం ఈ వెసులుబాటును తీసుకున్నామని చైనా అధికారులు వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా చైనా ఈ నిర్ణయం తీసుకుందని యూఏఈ విదేశీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఫర్ కాన్సులార్ అఫైర్స్ అహమ్మద్ అల్ ధనేరి తెలిపారు. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్న దేశం యూఏఈ అని ఆయన వ్యాఖ్యానించారు. యూఏఈ ప్రజలకు ఈ సౌకర్యం వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







