దుబాయ్ లో ఘనంగా క్రూజ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్
- December 23, 2017
దుబాయ్: దుబాయ్ లో క్రూజ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. గత రాత్రి ( 22 వ తేదీ శుక్రవారం ) జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా దుబాయ్ కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా వైస్ కన్స్యూల్ ఐ .డి. రాజు పాల్గొన్నారు. ముఖ్య ప్రసంగికులు ట్రూ విజడం మినిస్ట్రీస్ ఫౌండర్ బ్రదర్ ఆర్ వంశి క్రిస్మస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు. సృష్టికర్త కుమారుడిగా దేవాదిదేవుడైన ఏసుక్రీస్తు మానవులను పాపాల నుంచి రక్షించేందుకు తనను తానూ తగ్గించుకొని కన్య మరియా గర్భాన పశువుల పాకలో జన్మించాడన్నారు. ఏసుక్రీస్తు భూలోకంలో 33 న్నర ఏళ్ళు జీవించినం తకాలం ఎన్నో అద్బుతాలు, స్వస్థతలు చేసి దేవుని కుమారునిగా రుజువుచేసుకున్నాడన్నారు. క్రీస్తు బాటలో నడిచినప్పడే ప్రతి ఒక్కరి జీవితంలో అదే నిజమైన క్రిస్మస్ అని పేర్కొన్నారు. అనంతరం ఏపీ ఎన్ఆర్ టి కో ఆర్డినేటర్ ..గెస్ట్ అఫ్ హోనేర్ వాసురెడ్డి ప్రసంగిస్తూ చారిత్రిక ఆధారాలతో ఉన్న బైబిల్ చదవడం ద్వారా ఎన్నో వాస్తవాలు తెలుసుకోవచ్చన్నారు. నేటికీ జీవవాక్యం ద్వారా ఏసుక్రీస్తు తన ప్రజలతో మాట్లాడటం గమనించవచ్చన్నారు. డిసెంబర్ 25న జీసస్ పుట్టిన రోజును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు పండగలగా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేరల్స్ క్రీస్తు జననంపై అద్భుతమైన పాటలు ఉత్సాహంగా పాడేరు.ఈ పాటలకు సంగీత సహకారాన్ని కీ బోర్డును బ్రదర్ సుజ్ఞాన్ ( చిట్టి ), రిథమ్ ప్యాడ్స్ బ్రదర్ సరేళ్ళ ఏసు, తబలాను బ్రదర్ విజయ్ కుమార్ లు అందించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు శామ్యూల్ రత్నం , రెవరెండ్ జె. ఎస్ . పాల్ తదితరులు సక్రమ నిర్వహణలో క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేశారు.




తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







