అత్యంత వైభవంగా జరిగిన టీవీ5 బిజినెస్ లీడర్స్ అవార్డ్స్-2017....!!
- December 23, 2017
హైదరాబాద్: టీవీ5 బిజినెస్ లీడర్స్ అవార్డ్స్-2017 అత్యంత వైభవంగా జరిగింది. HICCలో జరిగిన మెగా ఈవెంట్‌లో అపోలో గ్రూప్ ఛైర్మన్.. డాక్టర్ సి.ప్రతాప్‌రెడ్డిని లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. 8 కేటగిరీల్లో 69మంది వ్యాపారవేత్తలు టీవీ5 బిజినెస్ లీడర్స్ అందుకున్నారు. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బిజినెస్ వరల్డ్ న్యూస్ పేపర్ హెడ్ అనురాగ్ బాత్రా చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. టీవీ5 ఎంతో ప్రతిష్టాత్మకంగా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని అతిథులంతా కొనియాడారు. వాస్తవాలకు ప్రతిరూపంగా నిలిచే టీవీ5 ఛానెల్ మరింత విస్తరించాలని కాంక్షించారు.
ప్రతిష్టాత్మకమైన టీవీ5 బిజినెస్ అవార్డ్స్ వేదికపై మరో విశిష్ట భాగస్వామ్యం ఆవిష్కృతమైంది. తెలుగునాట వాస్తవాలకు ప్రతిరూపమైన టీవీ5 న్యూస్ ఛానల్.. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న రిపబ్లిక్ టీవీతో ఎడిటోరియల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. టీవీ5-రిపబ్లిక్ టీవీ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నబ్ గోస్వామి. ఇప్పటికే తెలుగు-కన్నడలో టాప్ ఛానల్‌గా ఉన్న టీవీ5తో జతకట్టడం సంతోషకరమన్నారు అర్నబ్ గోస్వామి.
ప్రపంచ స్థాయి వైద్యసేవలు అందించాలన్నదే అపోలో లక్ష్యమన్నారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డీ ప్రతాప్‌రెడ్డి. అవయవ మార్పిడి ఆపరేషన్‌లో అపోలో దేశంలోనే నెంబర్ వన్ అన్న ఆయన.. అపోలో సిబ్బంది అంతా ఒకే కుటుంబంగా ఉంటామన్నారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చిన టీవీ5కి కృతజ్ఞతలు తెలిపారు.
8 జ్యూరీ అవార్డులతో పాటు 11 విభాగాల్లో మొత్తం 69 అవార్డులు అందజేసింది టీవీ5. ఈసారి కొత్తగా ఎన్నారై పారిశ్రామికవేత్తల కోసం NRT అవార్డు కూడా అందజేసింది. అతిరథ మహారథులు సమక్షంలో అట్టహాసంగా టీవీ5 బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. 3వందల నామినీలను వడపోసి.. రెండు నెలల పాటు సుదీర్ఘంగా శ్రమించి.. తొమ్మిది మంది జ్యూరీ సభ్యుల నిర్ణయాలను స్వీకరించి.. ప్రేక్షకుల SMSలను క్రోడీకరించి.. బిజినెస్ లీడర్స్ అవార్డులను ప్రకటించింది టీవీ5. అందుకే నిజమైన విజేతలందరికీ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







