'స్టూడెంట్ పవర్' సినిమా ఆడియో విడుదల
- December 23, 2017
కృష్ణ, పూర్ణి హీరోహీరోయిన్‌లుగా నటిస్తోన్న చిత్రం 'స్టూడెంట్ పవర్'. సత్యసాయికృష్ణ క్రియేషన్స్ పతాకంపై వి. కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వి. రాజ్ కమల్ సమర్పకుడు. గూన అప్పారావు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్ ఫిలిం చాంబర్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి బిగ్ సీడీని ఆవిష్కరించారు. లహరి ఆడియో ద్వారా పాటలు మార్కెట్‌లోకి వచ్చాయి.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''సినిమా పోస్టర్స్ బాగున్నాయి. టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. పాటలు బాగున్నాయి. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి. అలాగే శోభన్‌బాబు గారు, నేను మంచి స్నేహితులం. శోభన్ బాబు తాలూకు వ్యక్తులు ఈ సినిమా వెనుక ఉన్నారని తెలిసింది. చిత్రం మంచి విజయం సాధించాలి..'' అని అన్నారు.
చిత్ర నిర్మాత వి.కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ''మహేంద్ర వర్మ డిగ్రీ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్టూడెంట్ లీడర్‌కి.. అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. యానాం, రాజమండ్రి, పోలవరం, ద్వారకా తిరుమల తదితర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాశీ విశ్వనాధ్ కాలేజ్ ప్రిన్స్‌పాల్ పాత్రలో, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్. విద్యాసాగరరావు (లేటు) కాలేజ్ కమిటీ చైర్మన్ పాత్రలో నటించారు. ఇందులో 5 పాటలున్నాయి. చక్కని సాహిత్యానికి మంచి ట్యూన్స్ కుదిరాయి. పాటలు శ్రోతలందరినీ మెప్పిస్తాయి. అన్ని పనులు పూర్తిచేసి జనవరి మూడవవారంలో సినిమా రిలీజ్ చేస్తాం'' అన్నారు.
చిత్ర దర్శకుడు గూన అప్పారావు మాట్లాడుతూ.. ''ఓ ఊళ్లో దేవాలయం లాంటి కాలేజీని స్థానిక ఎమ్మెల్యే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో ఆ కాలేజ్ ప్రిన్స్‌పాల్... తమ స్టూడెంట్స్‌తో కలిసి ఎలా కాపాడుకున్నారనే ఇతివృత్తంతో కథ సాగుతుంది. సినిమా బాగా వచ్చింది. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయని ఆశిస్తున్నాం'' అని అన్నారు.a
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







