టీటీఎల్: ఫ్రాంఛైజీల కోసం బిడ్ల ఆహ్వానం
- December 23, 2017
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 20 వరకు తెలంగాణ టీ20 లీగ్ (టీటీఎల్) నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లీగ్ ఫ్రాంఛైజీల యాజమాన్య హక్కులు కట్టబెట్టేందుకు ఆసక్తిగల కంపెనీలు, సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. టోర్నీలో హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ జట్లు ఉంటాయి. జట్టు కనీస ధర రూ.12.50 లక్షలు. స్పాన్సర్ల భాగస్వామ్యాన్ని కూడా హెచ్‌సీఏ కోరుతోంది. దరఖాస్తులు శుక్రవారం నుంచి హెచ్‌సీఏలో అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తిగల సంస్థలు డిసెంబరు 30 సాయంత్రం నాలుగు గంటల లోపు సంబంధిత పత్రాలను మూసి ఉంచిన కవర్లో ఉంచి ఉప్పల్ స్టేడియంలో నిర్దేశిత డబ్బాలో వేయాల్సివుటుంది. మరిన్ని వివరణలకు ఈ మెయిల్ [email protected] లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







