ఓ పక్క తుపాను.. మరో పక్క అగ్నిప్రమాదం
- December 23, 2017
విలవిల్లాడుతున్న ఫిలిప్పీన్స్ మనీలా: ఓ పక్క భారీ తుపానుతో ఫిలిప్పీన్స్ దేశం వణికిపోతుంటే మరోపక్క ఓ షాపింగ్ మాల్లో జరిగిన అగ్నిప్రమాదం 37 మందిని బలిగొంది. స్థానిక ఎన్సీసీ మాల్లోని ఫర్నీచర్ దుకాణంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అదుపులోకి తెచ్చేలోపే మంటలు పైఅంతస్తు వరకు వ్యాపించడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతర్తే కుమార్తె, నగర మేయర్ సారా ఘటనాస్థలిని పరిశీలించారు. మరోపక్క దక్షిణ ఫిలిప్పీన్స్‌పై 'టెంబిన్' తుపాను విరుచుకుపడటంతో 133మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 81 మంది గల్లంతయ్యారు. ఫిలిప్పీన్స్‌లో రెండో అతిపెద్ద ద్వీపమైన మిందానోవాలో నివసిస్తున్న రెండు కోట్ల మంది తుపాను కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు ఎక్కువగా ఉండే జామ్‌బోవాంగా ద్వీపకల్పంలో వరదల ధాటికి సమీప సాల్వడోర్ నదిలో అనేక మంది గల్లంతయ్యారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల