మాజీ ప్రధాని బర్త్‌డే... 93 మంది ఖైదీలు విడుదల
- December 25, 2017
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని వాజ్ పేయి నివాసం వద్ద ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాజ్ పేయి జన్మదినం సందర్భంగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సత్ ప్రవర్తన కలిగిన 93 మంది ఖైదీలను విడుదల చేయనుంది.
ఢిల్లీలోని వాజ్ పేయి నివాసం సందడిగా మారింది. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు ఆయన నివాసనికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్ పేయి కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను కొనియాడారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







