సలాలా ఎయిర్‌పోర్ట్‌లో 'రెడీనెస్‌ డ్రిల్‌'

- December 25, 2017 , by Maagulf
సలాలా ఎయిర్‌పోర్ట్‌లో 'రెడీనెస్‌ డ్రిల్‌'

సలాలా: డిసెంబర్‌ 27, బుధవారం నాడు సలాలా ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జన్సీ ఎక్సర్‌సైజ్‌ జరగనుందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒమన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఓఎఎంసి), రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ (ఆర్‌ఓపి), దోఫార్‌ పోలీస్‌, పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ సంయుక్తంగా ఈ ఎక్సర్‌సైజ్‌ని సలాలా ఎయిర్‌పోర&్ట బయట నిర్వహించనుండడం గమనించదగ్గ విషయం. సుల్తాన్‌ కబూస్‌ హాస్పిటల్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హాస్పిటల్‌, సలాలా ఎయిర్‌ బేస్‌ కూడా ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొననున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్సర్‌సైజ్‌ని నిర్వహిస్తారు. హాస్పిటల్‌ నుంచి ఎక్సర్‌సైజ్‌ జరిగే ప్రాంతానికి ఈ సమయంలో రెగ్యులర్‌గా అంబులెన్స్‌లు తిరగనున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com