న్యూ ఇయర్‌ హాలీ డే: అబుదాబీలో ఫ్రీ పార్కింగ్‌

- December 25, 2017 , by Maagulf
న్యూ ఇయర్‌ హాలీ డే: అబుదాబీలో ఫ్రీ పార్కింగ్‌

అబుదాబీలో న్యూ ఇయర్‌ హాలీ డే సందర్భంగా వాహనదారులకు గుడ్‌ న్యూస్‌. న్యూ ఇయర్‌ హాలీ డే నేపథ్యంలో పార్కింగ్‌ ఉచితమని ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ - ఐటీసీ వెల్లడించింది. డిసెంబర్‌ 31 అర్థరాత్రి 12.00 గంటల నుంచి మంగళవారం, జనవరి 2 ఉదయం 7.59 నిమిషాల వరకు ఉచిత పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఐటిసి పేర్కొంది. వాహనదారులు నిషేధిత ప్రాంతాల్లో వాహనాల్ని నిలపరాదనీ, ట్రాఫిక్‌ ఫ్లో ఆపివేసేలా వాహనాలు నిలపవద్దని ఐటిసి సూచించింది. రెసిడెంట్‌ పార్కింగ్‌ బేస్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు వాహనాల్ని పార్కింగ్‌ చేయకూడదు. బస్‌ సర్వీసులు యధాతథంగా నడుస్తాయనీ, సాయంత్రం సర్వీసులు అబుదాబీ - అల్‌ అయిన్‌ మధ్య మాత్రం ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తాయని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఓ బస్‌ అందుబాటులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com