అమెరికాలో కుంభకోణం, భారత సంతతి సూత్రధారి దేశబహిష్కరణ

- December 28, 2017 , by Maagulf
అమెరికాలో కుంభకోణం, భారత సంతతి సూత్రధారి దేశబహిష్కరణ

నైపుణ్యం గల విదేశీ ఉద్యోగుల కోసం సడలించిన హెచ్1బీ వీసా నిబంధనలను ఆధారంగా చేసుకుని రెండు కోట్ల డాలర్ల (రూ.128కోట్ల) కుం భకోణానికి పాల్పడిన భారత సం తతి వ్యక్తి రాజు కోసూరి(45)ని అమెరికా ప్రభుత్వం దేశబహిష్కరణ వేటు వేసింది. ఆయన కుటుంబాన్ని భారత్‌కు పంపించేసింది. హెచ్1బీ మార్గదర్శకాలను వినియోగించుకుని వీసా ఫర్ సేల్ వ్యవహారాన్ని కొన్నేండ్లుగా రాజు కోసూరి అనే వ్యక్తి నడుపుతూ వచ్చారని ఫెడరల్ కోర్టు నిర్ధారించడంతోపాటు అతడికి 28నెలల జైలుశిక్ష విధించారు. శిక్షాకాలం పూర్తవడంతో రాజును, ఆయన భార్య స్మృతి జరియాను, జన్మతః అమెరికన్ అయిన వారి కుమారుడిని భారత్‌కు పంపేశారు. వర్జీనియాకు చెందిన వ్యాపారవేత్త రాజు కోసూరి (45) పలు డొల్లకంపెనీలను నెలకొల్పి వాటి ద్వారా వేలాది మందికి దొంగదారిన హెచ్1బీ వీసాలు ఇప్పించారని తేలింది. దీంతో 28నెలలపాటు ఫెడరల్ జైలులో రాజు శిక్ష అనుభవించాడు. శుక్రవారం ఆయన విడుదలపై ఫెడరల్ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ రాజుపై తీవ్రమైన అభియోగాలు నిరూపించనందువల్లే తక్కువ శిక్ష పడిందని న్యాయమూర్తి లియోనీ బ్రింకెమా అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com