ఖతర్‌కు మరిన్ని టర్కీ బలగాలు
- December 28, 2017
టర్కీ, ఖతర్‌ల మధ్య కుదిరిన సంయుక్త రక్షణ ఒప్పందంలో భాగంగా ఖతర్‌లోని సైనిక స్థావరానికి టర్కీ మరింతమంది సైనిక బలగాలను పంపింది. దోహాలోని అల్ ఉబెద్ వైమానిక స్థావరానికి తాజాగా బలగాలు చేరుకున్నట్లు కతార్ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. సంయుక్త సైనిక సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు కొత్తగా వచ్చిన సైనిక బృందం ఖతర్ సాయుధ బలగాలకు శిక్షణ ఇస్తుం ది. 2014లో కుదిరిన ఒప్పందంలో భాగంగా మధ్య ప్రాచ్యంలో తొలిసారిగా ఖతర్‌లో సైనిక శిబిరాన్ని టర్కీ నెలకొల్పింది. ఈ స్థావరంలో 5వేల మంది సైనికులకు వసతి కల్పించే సదుపాయం వుంది. కాగా, ఖతర్‌లో తన సైనిక బలగాలను నెమ్మదిగా 3వేలకు పెంచాలని టర్కీ యోచిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







