అమితాబ్‌ కోసం ఒమన్‌ ఎదురుచూపులు

- December 28, 2017 , by Maagulf
అమితాబ్‌ కోసం ఒమన్‌ ఎదురుచూపులు

మస్కట్‌: ఒమనీయులు, అలాగే ఒమన్‌లో నివాసం ఉంటోన్నవారు బాలీవుడ్‌ ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ రాక కోసం ఎదురుచూస్తున్నారు. మస్కట్‌లో కళ్యాణ్‌ జ్యుయెలర్‌ షోరూంలను అమితాబ్‌ బచ్చన్‌ ప్రారంభించనున్నారు. కళ్యాణ్‌ జ్యూయెలర్స్‌కి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్గఆ వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే. అమితాబ్‌తోపాటుగా ప్రభు గణేశన్‌, నాగార్జున, శివరాజ్‌కుమార్‌, మంజు వారియర్‌ తదితరులూ మస్కట్‌లో కళ్యాణ్‌ జ్యుయెలర్‌ షోరూం ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అభిమానుల్ని కలిసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ లేకపోయినా, తమ అభిమాన నటుల్ని కలిసేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు పెద్దయెత్తున అభిమానులు గుమికూడనున్నారు. 'వీలైతే ఫొటో, లేకపోతే కనీసం షేక్‌ హ్యాండ్‌ అయినా దక్కుతుందని ఆశిస్తున్నాను. ఇవేవీ జరగకపోతే, వారిని దగ్గరగా చూసే అవకాశం అయినా దొరుకుతుంది కదా..' అని ఓ హోటల్‌ ఎంప్లాయీ చెప్పారు. ఒమన్‌ అవెన్యూస్‌ మాల్‌ వద్దకు వెళ్ళి, అమితాబ్‌ కోసం ఎదురు చూస్తానని ఇంకో వ్యక్తి చెప్పారు. 75 ఏళ్ళ వయసులోనూ ఆయన అంత ఉత్సాహంగా సినిమాల్లో ఎలా నటిస్తున్నారో అని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందని ఇంకో అభిమాని చెప్పారు. ఈజిప్టియన్‌ టీచర్‌ ఒకరు, లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ని చూడాలనే ఆకాంక్షని వెలిబుచ్చారు. కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ కళ్యాణరామ్‌ మాట్లాడుతూ, సూపర్‌ స్టార్‌ అమితాబ్‌తో 2012 నుంచి తమ సంస్థ 'సంబంధ బాంధవ్యాల్ని' కొనసాగిస్తోందని అన్నారు. నెస్టో హైపర్‌ మార్కెట్‌ వద్ద మధ్యాహ్నం 3.30 నిమిషాలకు, రువి హైస్ట్రీట్‌ వద్ద 4.30 నిమిషాలకు, ఒమన్‌ ఎవెన్యూస్‌ మాల్‌ వద్ద 5.30 నిమిషాలకు కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌ షోరూంలు ప్రారంభమవుతాయి అమితాబ్‌ బచ్చన్‌ తదితరుల చేతుల మీదుగా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com